|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యల పై కేంద్ర రైల్వే మంత్రితో టిఆర్ఎస్ పార్టీజిల్లా అధ్యక్షురాలు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితమ్మ ప్రత్యేక భేటి పాండురంగాపురం-భద్రాచలం రైల్వేమార్గం ఏర్పాటు చేయాలి మహబూబాబాద్, డోర్నకల్ రైల్వేస్టేషన్ లలో మరికొన్ని రైల్వేహాల్టులు మంజూరు చేయాలి మణుగూరు-రామగుండం రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అనేక రైల్వే పరమైన అంశాలపై, సమస్యలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ప్రత్యేకంగా బేటీ అయ్యారు దక్షిణాది అయోద్యగా కీర్తిగడించిన భద్రాచలం శ్రీరామచంద్రస్వామివారి పవిత్ర దివ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారని వారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం పాండురంగాపురం నుండి భద్రాచలం కు 12కిమీ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు గత అనేక సంవత్సరాలుగా ఈఅంశంపై వినతులు సమర్పిస్తున్నామని గుర్తుచేసారు. శ్రీరామచంద్రుని దివ్యక్షేత్రం అభివృద్ధికి సహకరించాలని కోరారు మణుగూరు నుండి రామగుండం వయా భూపాలపల్లి నూతన రైల్వేట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని ప్రయాణీకుల రాకపోకలు విపరీతంగా పెరిగాయని మరిన్ని రైల్వేహాల్టులు కల్పిచాలని యంపి కవిత కోరారు. మహబూబాబాద్ లో రప్తిసాగర్, జిటిఎక్స్ ప్రెస్, విశాఖపట్నం సూపర్ పాస్ట్, నరసాపూర్ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ లు కల్పించాలని కోరారు డోర్నకల్ రైల్వేస్టేషన్ లో మణుగూరు ఎక్స్ ప్రేస్, పద్మావతి, చార్మినార్, గౌతమి, లింక్ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ కల్పించాలని యంపి కవిత కోరారు యంపి కవిత వినతులను సానుకూలంగా విన్న రైల్వేమంత్రి అశ్విన్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.