ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్ ) పర్యటనకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షణలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండు మూడు రోజులలో పూర్తి పర్యటన వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించతలపెట్టిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతో పాటు రఘునాథపాలెం మండలంలోని పలు అభవృద్ధి కార్యక్రమాలలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
రూ.8.50 కోట్లతో నగరప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇప్పటికే నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో దాదాపు రూ.1000 నుంచి రూ.1500 కోట్లతో అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఖమ్మం నగరంలో రూ.230 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధజలం అందజేస్తున్నారు. రూ.70 కోట్లతో గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టారు, ముఖ్యమ