తెలంగాణ ఐటి కి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్
తెలంగాణ ఐటీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న కేటీఆర్ చిరకాలం ప్రజాసేవలో సేవ కొనసాగాలని రత్నవరం తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని రత్నవరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్తులో కేటీఆర్ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కేటీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా నేడు రాష్ట్రంలో ఎదిగిందన్నారు. నేడు యువత అంతా కేటీఆర్ బాటలో పరిగెడుతున్నారు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వేడుకలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ వీర గోవింద్, కలకొండ వీరయ్య, కలకొండ వెంకన్న, కొమ్ము కిరణ్ తదితరులు పాల్గొన్నారు