ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

మ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఈ69న్యూస్ హన్మకొండ జులై 24/

హనుమకొండ కనకదుర్గ కాలనీలోని తన నివాసం లో యం.ఎల్.సి కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర ఐ.టి,పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోడం జరిగింది.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ..కే టి రామారావు రాష్ట్రానికే కాకుండా రాబోయే రోజులలో దేశానికే నాయకత్వం వహించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని,రాజకీయాలలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని దేశ ప్రజల దృష్టిని మరియు ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్న గొప్ప నాయకుడని,ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడని కొనియాడారు.కెటిఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ద్వారా ఈ రాష్ట్రం మరింత సేవలు అందుకోవాలని ప్రజలు యువత ఆయన యొక్క సేవలను పొందాలని ఆకాంక్షిస్తూ కె.టి.ఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.