janagama news local news telugu news

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు- పాల్గొన్న మార్కెట్ చైర్మన్,ఎంపీపీ,జడ్పీటీసీ

ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 24/

జనగాం జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు,ఎంపీపీ రడపాక సుదర్శన్,జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ లు పాల్గొని తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేత టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కట్ చేసి,మొక్కలు నాటారు.స్వల్ప గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ తొందరగా కోలుకోవాలని భగవంతున్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల రైతు కోఆర్డినేటర్ కడారి శంకర్,జఫర్గడ్ ఎంపీటీసీ 1జ్యోతి రజిత- యాకయ్య ,ఎంపీటీసీ 2 ఇల్లందుల స్రవంతి – మొగిలి,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య, మండల కార్యదర్శి రడపాక రైమాన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్,ప్యాక్ డైరెక్టర్ నాగరాజు,స్థానిక గ్రామ రైతు కోఆర్డినేటర్ కన్న సోమశేఖర్,స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు కుల్ల రాజు,శ్రీధ,ర్ సంపత్, గ్రామాశాఖల అధ్యక్షులు,ఇతర ప్రజా ప్రతినిధులు,పార్టీ ప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.