కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ఇది నాలుగొవ నోటిఫికేషన్

కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ఇది నాలుగొవ నోటిఫికేషన్ అని ఆ నోటిఫికేషన్ ల ద్వార ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వలేదని ఈసారి కూడ నిరుద్యోగుల ఆశల పైన నీళ్ళు చల్లడమేన అని పిసిసి మాజీ భూ కమిటీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లిగణేష్ లు అన్నారు.
చిన్నకోడూర్ మండల పరిధిలోని రామునిపట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిఐ ఎనిమిదేండ్లు గడుస్తుంది ఆయన పాలనలో ఇది నాలుగవ ఉద్యోగ ప్రకటన అని ఇప్పుడైనా కార్యరూపం దాల్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేనా అని అన్నారు.
నేటి ప్రకటన చూస్తుంటే గతంలో లాగానే ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికే అన్నట్లు ఉందని నిరుద్యోగులను దళితులను మభ్యపెట్టి మోసపూరితంగా మరోసారి అధికారం చేపట్టాలని చూస్తున్నాడని దళిత బంధు తో దళితులను, ఉద్యోగాల పేరా నిరుద్యోగులను మోసం చేయాలనీ చూస్తున్నాడని అన్నారు.
ఈసారి ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తిచేయకుండా ఎన్నికలకు దిగేతే టీఆరెస్ ను బొందపెట్టాడం ఖాయమని అన్నారు.ఈకార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు జంగింటి బాలరాజు, మండల నాయకులు బంక చిరంజీవి, బొల్లం సాయికుమార్ తదితరులు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.