కేసీఆర్ ను అపర భగరీథుడిగా చెప్పుకునే భజన బ్యాచ్ ?: విజయశాంతి

కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టామని చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకం నీరుగారిపోతోందని బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శించారు. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏడాదిగా మిషన్ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను అపర భగీరథుడిగా చెప్పుకునే భజన బ్యాచ్ దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఏడాదిగా పంప్ హౌస్ రిపేర్లు నడుస్తున్నాయని, మరమ్మతుల వల్ల నెలరోజుల నుంచి ఫిల్టర్ బెడ్లు బంద్ చేయడంతో నీటి శుద్ధి ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు. పేరుకు మాత్రం తెలంగాణ మొత్తం స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నామని కేసీఆర్ సర్కారు గొప్పలు చెప్పుకుంటోందని, ఈ అబద్ధాల కోరు సర్కారును తెలంగాణ ప్రజానీకమే జలసమాధి చేయడం ఖాయమని విజయశాంతి పేర్కొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.