మామనరావు దంపతుల హత్యను ఖండించిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న రాజకీయ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ జన్మదినానికి 400 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్-నాన్ టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి సామల శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులారా మీరు ఈరోజు తలపెట్టిన ఈ కోటి మొక్కల కార్యక్రమం ఎంతవరకు సమంజసం అని దానికి దాదాపుగా 400 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగ పరచడం కాక మరే ప్రయోజనం ఉందని అయన ప్రశ్నించారు. అసలు మొక్కలు నాటే సమయం ఫిబ్రవరి నెలలోనా ఈసమయంలో నాటిన మొక్కలు అభివృద్ధి చెందుతాయా. వచ్చేనెల మార్చిలో తాగడానికి నీరు లేక భూగర్భజలాలు సైతం అడుగంటిపోయే తరుణంలో మొక్కలు నాటుట ఎంతవరకు న్యాయమని వారు పేర్కొన్నారు. జూన్ మరియు జూలై లో హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతున్నారు కదా ఈ సందర్భంలో 400 కోట్ల రూపాయల్ని వెచ్చించి ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం కన్నా గత 11 నెలలుగా ఉపాధి కోల్పోయి నిరుద్యోగంతో తినడానికి తిండి లేక ఆకలి కేకలు కాస్త ఆకలి చావులు గా మారిన తరుణంలో తిండి కోసం పస్తులు ఉంటున్న మూడు లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం వెచ్చించి ఉంటే ఎంత బాగుండేదో ఒక్కసారి మీరంతా గుండె మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలని వారు గుర్తు చేశారు. కరోన లాక్ డౌన్ అనంతరం దాదాపు అన్ని రంగాల వారికి ఉపాధి దొరికి లబ్ధి చేకూరిందని కేవలం ప్రైవేటు ఉపాధ్యాయులు మాత్రమే నిరుద్యోగంతో ఉపాధి లేక తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎలా ఈ కార్యక్రమం చేపట్టాలనిపించింది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అలాగే నిరుద్యోగులు ఎంతో మంది ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్న పట్టించుకోకుండా ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి మార్చి నెలలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో నిరుద్యోగ పట్టభద్ర ప్రైవేటు ఉపాధ్యాయుడైన నాకు తమ అమూల్యమైన నా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించ వలసిందిగా వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాలోని దాదాపు 5 లక్షల మంది పట్టభద్రులను విఙ్ఞప్తి చేస్తూన్నాని వారు పేర్కొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.