జిల్లా సమగ్రాభివృద్ధికై మరో పోరాటానికి సిద్ధం కావాలి!!*

(జనగామ ఎవల్యూషన్ జిల్లా అధ్యక్షులు బిట్ల గణేష్)

జనగామ జిల్లా అభివృద్ధికి ఆటంకం ప్రజాప్రతినిధులే కారణమని, కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీ ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు గళం విప్పి చిత్తశుద్ధి నిలుపుకోవాలని లేకుంటే జనగామ జిల్లా సమగ్రాభివృద్ధి ఉద్యమాలతోనే సాధ్యమని ఉద్యమాలతోనే ఆత్మగౌరవం, హక్కులు సాధించబడతాయని జిల్లా ప్రజలు మరోసారి నిరూపించాల్సి వస్తదని జనగామ ఎవల్యూషన్ జిల్లా అధ్యక్షులు బిట్ల గణేష్ తెలిపారు.

దివి: 30-07-2022 శనివారం జనగామ పట్టణంలోని స్థానిక ప్రజాసంఘాల జిల్లా కార్యాలయం నుండి జనగామ ఎవల్యూషన్ జిల్లా అధ్యక్షులు బిట్ల గణేష్ పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ జనగామ జిల్లాకేంద్రంగా ఏర్పడిన ఇంకా కొన్ని మండలాలు మహబుబాబాద్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉండటం వల్ల జిల్లా అస్థిత్వం కోల్పోయిందన్నారు.
మూడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ, ఇతర జిల్లాల్లో మండలాల పరిధి ఉండటం వల్ల మండలాలను అస్తవ్యస్తంగా, అవిచ్ఛిన్నంగా విడదీసి పాలకులు పబ్బం గడుపుతూ జిల్లా స్వరూపాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని విమర్శించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి వేరు చేయబడిన జనగామ జిల్లా నియోజకవర్గాల కేంద్రాలతోపాటు, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ అంశాల్ని మరియు జనగామ జిల్లా సంపూర్ణ ముఖచిత్రాన్ని, జిల్లా సమగ్రాభివృద్ధికై స్థానిక ప్రజలతో కలిసి పోరాటం సాగాల్సిన అవసరం ఉంది.
సమగ్రాభివృద్ధి అంటే సంపండ వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలతోపాటు జిల్లాలో విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, పారిశ్రామిక, వ్యవసాయ, రవాణా తదితర రంగాలు అభివృద్ధి సాధించినప్పుడే జిల్లా సమగ్రాభివృద్ధి సాధించినట్లవుతుందని తెలిపారు. పోరాడి సాధించుకున్న జిల్లాలో మరో ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా ఏర్పాటు,… ఇతర విషయాలలో జనగామ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్, లింగాలఘణపురం మండలంలోని జీడికల్, జనగామ మండలంలోని పెంబర్తి, బచ్చన్నపేట మండలంలోను, దేవరుప్పుల మండలంలోను కొత్త మండలాల ఏర్పాటుకు ప్రజలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారని తెలిపారు.జిల్లా ప్రజల మనోభావాలను, అధికారుల నివేదికలను పట్టించుకోకుండా ప్రభుత్వం,… ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతల్లో 14 మండలాలను ప్రకటించిందన్నారు. దీనితో జిల్లాలో మరో పోరుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు. జనగామ అర్బన్, జనగామ రూరల్ తో పాటు ఆయా మండలాల్లో డిమాండ్ ఉన్న గ్రామాలను ప్రజల పరిపాలన, సంక్షేమ సౌకర్యార్ధం మండలాలుగా చేయాలని, అలాగే పాలకుర్తిని రెవిన్యూ డివిజన్ గా, స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీగా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికై పోరాటం చేసే ప్రతిఒక్కరితో కలిసి ఉద్యమ కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.