కొత్త వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్ లను విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలి

కొత్త వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్ లను విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలి, కార్మిక కర్షక పొరు యాత్ర ను జయప్రదం చేయండి కొత్త వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్ లను విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 2021 జనవరి 20 నుండి ప్రారంభమైన కార్మిక కర్షక యాత్ర ఈ నెల 30న పాలకుర్తి చేరుకుంటుందని ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలనిసిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల సోమన్న కోరారు,బుధవారం స్థానిక పాలకుర్తి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరుయాత్ర కరపత్రం ఆవిష్కరించడం జరిగింది,ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల రైతుల సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తూ నాలుగు కార్మిక వ్యతిరేక కోళ్లను అప్రజాస్వామికంగా ఆమోదించుకున్నరని వారన్నారు,కార్మికులను కట్టు బానిసలుగా చేసి సమ్మె హక్కులను హరించే విధంగా కొడ్ లను మార్చేశారని ఈ విధంగానే 3 వ్యవసాయ చట్టాలను ఆమోదించి నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టానికి సవరణ చేసి, కార్పొరేట్ మరియు కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని దేశ విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, ఈ చర్యల వల్ల దేశఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, ఈకార్యక్రమంలో బొడ,యాకయ్య, గుండె సారయ్య,ఎడవెళ్ళి యాదగిరి, కుమార్,సమ్మయ్య, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.