ఏలూరు నుండి కొబ్బరి బొండాల లోడుతో నందిగామ వైపు వెళ్తున్న బొలెరో వాహనం టైలర్ పగలడంతో కీసర ఇన్వెంటా కెమికల్ సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు బోల్తా పడిన బొలెరో వాహనం నుండి కొబ్బరిబొండాలు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. రహదారి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు