paleru news local news satyavathi rathod

ఈ69న్యూస్ మరిపెడ:-

మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం,కోటియా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని చౌల తండా వ్యవసాయ కూలీలను మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ…

పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వ్యవసాయ క్షేత్రంలోని 22మంది కూలీలు చిక్కుకుపోయారు.విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి , సిఎస్ గారితో మాట్లాడి రక్షణ చర్యలకు ఏర్పాటు చేశాం.
వ్యవసాయ కూలీల రక్షణకు సహకారం అందించిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలియజేశారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకుండా ఎన్ డి ఆర్ ఎఫ్ ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు.
శనివారం ఉదయం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు 22మందిని రెస్క్యూ చేసి సురక్షితంగా రక్షించారు.
వ్యవసాయ కూలీల రక్షణ చర్యలలో నిరంతర కృషి చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు అధికారులను , ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
తండాకు రోడ్ల కనెక్టివిటీ ఏర్పాటుకు ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టిమేట్ చేయించి రోడ్లకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యంతో పాటు, 5వేల రూపాయల వ్యక్తిగత సాయాన్ని మంత్రి అందించారు.
వ్యవసాయ కూలీల ఆరోగ్య రీత్యా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.
వారి హెల్త్ కండిషన్ ప్రస్తుత పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి.
భారీ వర్షాలతో వాగులు, కల్వర్టుల పై వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వారికి సూచించారు.ప్రజలు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు అండగా ఉంటాం.
మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,పాశం నరేష్ రెడ్డి,భరత్ రంగన్న, అఫ్జల్, నెహ్రూ, శ్రవణ్, బాలాజీ, తేజావత్ సోమన్న తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.