#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

పట్టణాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం

👉పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

👉మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

👉 22వ వార్డులో 43 లక్షల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలకు
శంకుస్థాపన

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

కోదాడ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం కోదాడ పట్టణంలోని 22వ వార్డులో రూ.43లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు,మురికి కాల్వ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.ప్రతినెలా మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.ప్రణాళకా బద్దంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు.త్వరితగతిన అండర్ గ్రౌండ్,డ్రైనేజీ నిర్మాణపు పనులు పూర్తి చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని ఆయన కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన సూచించారు.ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదు అని ఆయన అన్నారు.కోదాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని ఆయన అన్నారు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు అని తెలిపారు.కోదాడ మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని ఆయన అన్నారు. స్థానిక నాయకులతో కలిసి వార్డులో తిరుగుతూ సమస్యలను గుర్తించారు. ఎమ్మెల్యే గారు అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కోట మధుసూదన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రోజా రమణి, 22 వ వార్డు టిఆర్ఎస్ అధ్యక్షులు నాగిరెడ్డి, సంపేట ఉపేందర్ గౌడ్, కౌన్సిలర్లు గుండెల సూర్యనారాయణ,పెండెం వెంకటేశ్వర్లు, కట్టే బోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, ఒంటిపులి శ్రీను,తిపిరిశెట్టి సుశీల రాజు, తాజ్, బెజవాడ శ్రవణ్, వంశీ నాని, కోటయ్య, శేషయ్య, మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, వెంకట్రావు, బరపటి కోటేశ్వరరావు, తోగరు మధు, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, కృష్ణ, ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి , జీవి సార్, కరుణాకర్, శంకర్, తరుణ్, సత్యం, కిషోర్ ,క్రాంతి రాక్ స్టార్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.