క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జాగృతి మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మధిర నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు జాగృతి మధిర మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్ గారు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మానవాళి అంతా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయట పడేలా క్రిస్మస్ ప్రార్థనలు చేయాలని క్రైస్తవ సోదరులను ఆయన కోరారు. క్షమ కరుణ ప్రేమ త్యాగం అనేవి మానవ జీవితానికి అవసరమని వాటిని పాటించాలని చెప్పిన క్రీస్తు బోధనలు అందరూ ఆచరించాలని పగిడిపల్లి వినోద్ గారు క్రైస్తవ సోదరులకు సూచించారు. శాంతి సహనం సేవాభావం యేసు చూపిన మార్గాలు ప్రజల్లో గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలవాలని క్రీస్తు చూపిన బాటలో ముందుకు నడవాలని క్రైస్తవ సోదరులకు పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిరి సంపదలతో పాడి పరిశ్రమ లతో సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.