క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం……. గతంలో పామిడిలో C I గా విధులు నిర్వహించి ప్రస్తుతం అనంతపురం లో విధులు నిర్వహిస్తున్న C.I. శ్రీనివాసులు రూ. 7000/-మరియు ప్రస్తుత పామిడి S.I.గంగాధర్ రూ. 5000/- రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొంది అస్సాం రాష్ట్రం గౌహతి ‌లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులు లావణ్య, జాహ్నవి, శైలు ల ప్రయాణ ఖర్చులకు క్రీడాకారిణుల శిక్షకుడు అయిన పీ.ఈ.టీ కార్తిక్ కి అందజేశారు. క్రీడాకారులను ఎప్పుడూ ప్రోత్సహించే శ్రీనివాసులు గతంలో కూడా గ్రౌండ్లో సాధన చేసే క్రీడాకారిణిలకు షూస్ అందజేయడం, సమ్మర్ కోచింగ్ క్యాంప్లో 45 రోజుల పాటు గుడ్లు, అరటి పండ్లు అందజేయడం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 400 మీటర్ల ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం ఇలా చాలా విధాలుగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వచ్చారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు ‌‌‌గారికి మరియు గంగాధర్ కి క్రీడాకారులు వారికి క్రుతగ్నతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అభయ ఆపద్భాందవ సంస్థ సభ్యుడు షామీర్, పీ.ఈ.టీ హనుమేష్, సలీం, మరియు క్రీడాకారిణిలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.