#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు చెస్ పోటీలు దోహదపడతాయని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ లు అన్నారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలో శ్రీ గాయత్రి పాఠశాలలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చదరంగం పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చదరంగంలో కోదాడ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప జేసిన చెస్ చిచ్చరపిడుగు స్వర్గీయ మేకల అభినవ్ ను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మేధో సంపత్తిని మెరుగుపరిచే బీచెస్ క్రీడకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని పిల్లలను బాల్యం నుండే ఈ క్రీడపై ఆసక్తి కలిగించాలి అన్నారు. ఇటువంటి చెస్ టోర్నమెంట్ లకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాస్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి పుల్లారెడ్డి, సర్పంచి ఉపేందర్, pacs చైర్మన్ కండిబండ సత్యనారాయణ, నాయకులు నల్లపాటి శ్రీనివాస్ రావు,యాలక వెంకట్ రెడ్డి,యుగంధర్ రెడ్డి, కోలా ఉపేందర్,రామయ్య, ఉడుం కృష్ణ,బండారు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.