సునీల్ నాయక్ కు శ్రద్దాంజలి.. పోరాడి జీవితాన్ని గెలవాలి.. ఆత్మహత్యలు పరిష్కారాలు చూపవు.. ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి

సునీల్ నాయక్ కు శ్రద్దాంజలి.. పోరాడి జీవితాన్ని గెలవాలి.. ఆత్మహత్యలు పరిష్కారాలు చూపవు.. ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి
ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న బోడ.సునీల్ నాయక్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం అని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి అన్నారు. సునీల్ నాయక్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియచేసారు మనిషి జీవితమే పోరాటమని.. పోరాడి జీవితాన్ని గెలవాలి తప్ప ఆత్మహత్యలు ఎప్పుడు పరిష్కారమార్గాలు కావన్నారు. పసితనం నుండి మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని.. కంటికి రెప్పలా కాపాడుకున్న మీ..తల్లిదండ్రులకు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కడుపుకోతను మిగులుస్తుందన్నారు.. ఎప్పటికపుడు కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు పోవాలని.. క్షణికావేశనికి లోనై ప్రాణాలు తీసుకోవడం సరైంది కాదని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు.
దేశభవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన విద్యార్థులు.. తమ భవిష్యత్ ను ఇబ్బందుల పాలు చేసుకోవద్దని సూచించారు… విద్యార్థులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులపాలు అవుతారని అది వారి భవిష్యత్ పురోగతికి ఆటంకంగా మారుతుందన్నారు. ఆవేశంలో తీసుకునే ఏ..నిర్ణయం అయినా ప్రమాదాలను.. విషాదాలనే మిగులుస్తుందని.. ఆలోచనతో వేసే ప్రతి అడుగులోను ప్రగతి కనిపిస్తుందన్నారు.. క్షణికావేశంలో విఘాతలకు కారణం అవడం వల్ల భవిష్యత్తులో నష్టం కలుగుతుందని విద్యార్థులు, యువకులు ఆ..దిశగా ఆలోచించాలన్నారు. తమ భవిష్యత్తు.., తమ పై ఆశలు పెట్టుకున్న కుటుంబాల భవిష్యత్తు.. గురించి ఆలోచించి సానుకూల దృక్పథంతో నడుచుకోవాలని ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి కోరారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.