క్షయ వ్యాధి శాశ్వత నిర్ములనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

క్షయ వ్యాధి శాశ్వత నిర్మూలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం అనంతగిరి మండలంలోని త్రిపురవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వరల్డ్ టిబి డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వ వైద్యశాలలో సరైన చికిత్స ఉండేది కాదని ప్రజలు ప్రయివేటు వైద్యశాలలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన అందుబాటులోకి తెచ్చాంఅన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా టిబి జబ్బు కు వైద్యం అందిస్తుందన్నారు. టిబి వ్యాథి గ్రస్తులకు ప్రభుత్వం ఆర్థికంగా కూడా సహాయం అందిస్తుందన్నారు. క్షయ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , త్రిపురవరం వైద్యురాలు డాక్టర్ లక్ష్మీప్రసన్న, పబ్లిక్ హెల్త్ నర్స్ కళావతి , విజయ్ కుమార్ , రత్న మేరీ, శైలజ, మహేష్ , విజయ , ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.