ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి- ఎస్ఎఫ్ఐ

రేపు అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ధర్నా…

ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు..

శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్లో జరిగిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు… మాట్లాడుతూ :- ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన చేసి నిధులు కేటాయించాలనిఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో రేపు మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ధర్నాలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు విద్యార్థులకు పిలుపునిచ్చారు.. ప్రైవేటు వారికి ఇవ్వడానికైతే ప్రభుత్వం చూస్తోంది కానీ ప్రభుత్వ యూనివర్శిటీని ఏర్పాటు అమలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అలాగే ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులకు లాభం జరుగుతుందని… కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఖమ్మం లో చదువుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు… ప్రైవేట్ యూనివర్శిటీలను ప్రోత్సహించటం కంటే ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు…. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు జగదీష్, స్నేహ, కావ్య, శ్రావణి, రాము, సంతోష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.