ఖరీఫ్ వేరుశనగ విత్తన సేకరణ లో మన ముఖ్యమంత్రి శ్రీ.వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు హర్షణీయం – వై. వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, గుంతకల్లు.
నేను గతంలో ఖరీఫ్ సీజన్ లో వేరుశనగ విత్తన సేకరణ లో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకుని వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి నివేదికలను రూపొందించి స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ. వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది, దాని పర్యవసానంగా నేడు రైతులకు రెండు విధాలుగా లబ్ధి చేకూరేలా ఎలాంటి దళారుల ప్రమేయము లేకుండా విత్తన సేకరణ చేస్తూ రైతుల అకౌంట్ లలో డబ్బు పడేలా విధి విధానాలు రూపొందించడం దేశం లోనే ఎక్కడ లేని విధంగా జరుగుతున్నది.
ప్రస్తుతం రైతు పండించిన వేరుశనగ ను ప్రభుత్వమే నిర్ణయించిన ధర Rs.6400/- కు కొని ఆ డబ్బు నేరుగా రైతుల ఖాతా లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
గతం లో మన విత్తన కేంద్రాలు అని పేరు చెప్పి దళారుల ప్రమేయం తో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా నాణ్యత లేని విత్తనములు సరఫరా చేసేవారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో Rs.5800/- ఉన్న వేరుశనగ ప్రభుత్వమే ఎక్కువ ధర కు ఆనగ Rs.6400/- కు కొని ప్రాసెస్ చేసి నాణ్యమైన విత్తనలు రైతులకు సబ్సిడీ కింద దాదాపు Rs.2000/- తక్కువ రేటు తో అందించడం జరుగుతున్నది. అన్ని విధాలా దళారుల ప్రమేయము లేకుండా రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు మా నివేదికలను స్పందించి రైతులకు న్యాయం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను