రహమత్ డివిజన్ బి జె ఆర్ నగర్, వినాయక్ నగర్ ,మహాత్మా నగర్, ఓం నగర్ బస్తీలలో మంచినీటి సమస్యను పరిష్కరించండి నాలుగు రోజులకు ఒకసారి మంచి నీరు వస్తున్నాయి రోజు విడిచి రోజు మంచి నీరు వచ్చే విధంగా చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముట్టడి కరపత్రాన్ని విడుదల చేసిన సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ స్వామి. ఫ్రీ వాటర్ అని చెప్పి నో వాటర్ గా మారిందని వాటర్ అసలు రావడమే లేదని ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతంలో పేదలు కార్మికులు నివసించే బస్తీలలో వాటర్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాటర్ ప్రెషర్ పెంచాలి .మురుగునీరు పోయే విధంగా డ్రైనేజీ సిస్టం కొత్త పైపులు వేయాలి మంచి నీటి పైపులు కూడా 25 సంవత్సరాల కిందట వేశారు పైపు లీక్ అయ్యి డ్రైనేజ్ వాటర్ కలిసి వస్తుంది మంచి నీటి పైప్ లైన్ కూడా మార్చాలి తెలిపారు ప్రజలందరూ పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహ, భాగ్య రాజు, దేవదాసు రాపర్తి అశోక్, తదితరులు పాల్గొన్నారు