గండ్రకు ఘనంగా స్వాగతం పలికిన దామరంచపల్లి గ్రామ ప్రజలు

25 లక్షల రూపాయల తో CC రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన …. గండ్ర

82 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మీ మరియు 13 లక్షల 41 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన … గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో దామరంచ పల్లి గ్రామంలో 25 లక్షల రూపాయల నిధులతో సి సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు రేగొండ మండలం కేంద్రంలోని రైతు వేదికలో 82 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాధిముభారక్ చెక్కులను, 33మంది లబ్ధిదారులకు 14 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మన ప్రియతమ నాయకులు,భూపాలపల్లి శాసనసభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి,దామరంచపల్లి గ్రామంలో CC రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, భూపాలపల్లి తెరాస పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి,ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ..సొంత వారే కాదు పో అంటున్న పేదింటి ఆడబిడ్డలకు కెసిఆర్ మేనమామలా,తోబుట్టువులగా నేను ఉన్న అంటూ కళ్యాణలక్ష్మి షాధి ముబారక్ పథకం ద్వారా 1 లక్ష 16 రూపాయలను ఇస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అన్నారు,వివిధ కారణాల చేత ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి తోడ్పడుతూ ఉచిత విద్య, వైద్యం, రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు (మిషన్ కాకతీయ,భగీరథ, ప్రాజెక్ట్స్) పధకాలను ప్రవేశపెట్టి రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు అన్ని విధాలా తోడ్పడుతుంది అన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు, పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధి చెందెల అనునిత్యం పని చేస్తున్నాం అని అన్నారు.త్వరలోనే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా రాబోతుంది.పేద ప్రజలకు ఉచిత విద్యను అందించాలన్న సంకల్పంతో మన ఊరు మన బడి పేరుతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ,మండల పార్టీ అధ్యక్షులు,PACS చైర్మన్, వైస్ ఎంపీపీ, గ్రామ సర్పంచ్లు,ఎంపీటీసీ లు,యూత్ అధ్యక్షులు,కో ఆప్షన్ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు,మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు,గండ్ర యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.