ఈరోజు 29-12-2020 మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత పదహారు రోజుల నుండి ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు వృత్తి సంఘాలు పాల్గొన్నాయి ఇందులో భాగంగా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎల్ వీ రమణ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ మరియు గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ అధ్యక్షులు పి రాములు ఉపాధ్యక్షులు పెండ్యాల సంజీవ తదితరులు పాల్గొన్నారు