ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బానోత్ బాలాజీ అద్యక్షతన మంచికంటి ఫంక్షన్ హాల్ లో గిరిజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది..10 శాతం #గిరిజన #రిజర్వేషన్ #సాధన #జేఏసీగా #ఏర్పడింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా టిజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #రమావత్ .#శ్రీరాంనాయక్ హాజరై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదించారు… ఈ సమావేశంలో టిజీఎస్ జిల్లా కార్యదర్శి వీరభద్రం తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రామ్మూర్తి నాయక్, సేవలాల్ సేన రాష్ట్ర రైతు అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ ,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్ర చౌహాన్,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ భద్రు నాయక్,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు బస్కీనాయక్ ,తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గికృష్ణ వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.
