గిరిజనుల భూములలోకి అక్రమంగా ప్రవేశించిన కుంభం గెల్వాల్ రెడ్డి ని అరెస్ట్ చేయాలి


ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు దేశ ద్రోహం కింధ కేసు నమోదు చేయాలి..
గిరిజనుల భూముల కు రక్షణ కల్పించాలి..
ఆకారణంగా గిరిజనుల పై దాడి చేసిన ఎస్.ఐ ని సస్పెండ్ చేయాలి..

ప్రజా సంఘాల నేతలు పాలడగు నాగార్జున, పందుల సైదులు,మానుపాటి బిక్షం

గిరిజనుల భూములలోకి అక్రమంగా ప్రవేశించి భయబ్రాంతులకు గురిచేస్తు గిరిజనుల ను నానా దుర్భాషలాడుతూ వారి పై దాడులు చేస్తున్న కుంభం గెల్వాల్ రెడ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు, ఎరుకల హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షం డిమాండ్ చేసారు.

గురువారం నల్లగొండ లోని ఆర్ అండ్ బి అతిథ గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో గిరిజన భూ బాధితులతో కలిసి వారు మాట్లాడుతూ గుర్రంపూడ్ మండలం కొప్పోలు గ్రామ రెవెన్యూ పరిధిలో ని 498 సర్వే నెంబర్ లో గత నాలుగు దశాబ్దాలుగా ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనులైన ఎరుకల జాతి కులస్తుల భూమిని రాజకీయ అండదండలతో ఆక్రమించుకున్నాడని ఇది గిరిజనుల హక్కులను హరించడమేనన్నారు..మాజీ సైనికుడి పేరు తో దొంగ సర్టిఫికెట్ లు సృష్టించి రెవిన్యూ అధికారులను మోసం చేసి “మాజీ సైనికుల” కోటాలో అక్రమంగా రెండు ఎకరాలు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న గెల్వాల్ రెడ్డి…దేశం కోసం ఆహర్ణిశలు కష్ఠపడుతున్న సైనికుల పేరును వాడుకోవడంతోపాటు,దేశ ప్రతిష్ఠతకు భంగం కలిగేవిధంగా వ్యవహరించినందున అతని పై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.

భూమి తనదని ఎరుకలోల్లకు మీకు భూములెక్కడవని గెల్వాల్ రెడ్డి మాట్లాడం ఎరుకల జాతి ని కించపర్చడమేనన్నారు.నలబై ఏండ్లుగా పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి సేధ్యం చేసుకుంటున్న గిరిజనుల పై అగ్రకులాల దౌర్జన్యం ఏమిటన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు,జిల్లా కు చెందిన కీలకమైన పెద్ద మనిషి తలదూరుస్తున్నాడని ఇది మంచిపద్దతి కాదని మానుకోవాలని హెచ్చరించారు.గిరిజనుల భూముల నుంచి వెనక్కి వెల్లిపోకపోతే,ప్రభుత్వ అధికారులు చోర్వ చూపకపోతే దళిత సంఘాలు, గిరిజన సంఘాలు,ప్రజా సంఘాల తో కలిసి ఆ భూమి లోకి ప్రవేశించి గిరిజనులకు అండగా నిలబడతామన్నారు.ఈ విషయంలో గుర్రంపూడ్ ఎస్.ఐ స్థానిక రాజకీయ నాయకుల మాటలు విని అక్కడ గిరిజనులను డి.టి.సి కి తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టి,దాడి చేసే హక్కు ఎక్కడిదన్నారు.వాస్తవావాస్తవాలు తెలుసుకోకుండా ,సమగ్రమైన విచారణ చేయకుండా సివిల్ వివాధాలలో తలదూర్చిన ఎస్.ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో బాదిత గిరిజనులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.