గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు ఆషాడ మాసంలో

ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని బాదిగూడా గ్రామ ఆదివాసి గిరిజనులు వారు జరుపుకునే ఏ పండుగ అయినా వేడుక అయినా సర అందులో వాటికి పెద్దపీఠ వేస్తారు. అందులోనే వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అలాంటి గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు ఆషాడ మాసంతో మొదలవుతాయి. అందులో ఈ ఆషాడ మాసంలో జరుపుకునే తొలి పండుగ అకాడి అని జరుకుంటారు. ఆశాడ మాసం వచ్చిదంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం బాదిగూడా గ్రామంలో పండుగల సందడి మొదలు చెప్పాటారు. అందులో మొదటగా వచ్చే పండుగ అకాడి పండుగ అని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాల్లో మొన్నటి వరకు ఈ అకాడి పండుగను సంబురంగా జరుపుకున్నారు. ఈ అకాడి వేడుకల్లో భాగంగా గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో బాబ్రి చెట్టు వద్దకు పోయి చెట్టుకింద ఉన్న పవిత్ర దేవతలను శుద్ది చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలోనే ప్రత్యేక భోజనాన్ని తయారు చేసి రాజుల్ దేవతలకు నైవేధ్యంగా సమర్పిస్తారు. గ్రామ ప్రజలతోపాటు పశువులు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. భోజనాన్ని ముద్దలుగా చేసి ప్రసాదం గా స్వీకరిస్తారు. కోడి, మేకలను కూడా బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అక్కడె అందరు కలిసి సహా పంక్తి భోజనాలు చేస్తారు. ఆ తర్వాత లక్ష్మణ రేఖ వంటి గీతను గీసి పశువులతో ఆ గీత దాటించి అడవులకు తీసుకెళతారు. పూజ అనంతరం అడవి నుంచి కొన్ని చెట్ల ఆకులను ఇంటికి తీసువాస్తారు. వాటిని దేవుడి వరంగా భావిస్తారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఆకుల పొగ వేస్తే వ్యాధి నయమవుతుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ సిడాం లక్ష్మీకాంత్, దేవరి పెందుర్ బండు, మహజన్ అశోక్, పేందర్ యాదవ్, పేందర్ బాదు, గేడం సీతారాం. పేందర్ రాములు. కనక జైవంత్ రావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.