ఎమ్మెల్యే సీతక్క
ఏటూరునాగారం లో కుల పెద్ద మనుషుల కులగోత్రాల ఆచార సాంప్రదాయాల పెద్దమనుషుల సభకు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలో B.R ఫంక్షన్ హాల్ లో జరిగిన కుల పెద్దల ఆచార సాంప్రదాయాల సభకు ఈసం నర్సయ్య గారు అధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్యఅతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్కగారు,
సీతక్క మాట్లాడుతూ… ఎన్నో ఏండ్లుగా వస్తున్న గిరిజన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలని చెట్లను వనదేవతలుగా పూజించే సంప్రదాయాన్ని కాపాడాలని,
సమ్మక్క, సారలమ్మ దేవతలను వన దేవతలుగా పూజించే సంప్రదాయం కూడా మనదేనని అన్నారు. అదేవిధంగా కులమతాలకు అతీతంగా రాగద్వేషాలకు పోకుండా అందరితో అవినాభావ సంబందాలు కలిగి ఉండాలని ప్రకృతిని ప్రేమించే సాంప్రదాయం మనకు ఉందని పకృతి దేవతలను ఆరాధించే సాంప్రదాయం మనది అని యువకులు పెద్దలను గౌరవించే సంప్రదాయం మనకు ఉందని దానిని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మర్యాదలు మానవత్వాన్ని మనిషి తత్వాన్ని చాటాలని అన్నారు. పకృతి నుండి ప్రసాదించిన పండ్లు గాని చెట్టు కాయలు గాని కూరగాయలు గాని ముందుగా వనదేవతలకు, పెద్దలకు, పూర్వీకులకు పండ్లు, ఫలాలు ముందుగా సమర్పించిన తర్వాతనే అట్టి దానిని మేము తర్వాత స్వీకరిస్తామని అన్నారు. అందరూ కూడా ఇట్టి ఆచార సంప్రదాయాలను కాపాడాలని వాటిని అవలంబించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు డాక్టర్ D.M.H.O అప్పయ్య గారు, కొమురం ప్రభాకర్ గారు పీసా చట్టం అధ్యక్షులు, పోవడం రత్నం గారు, మల్లెల లక్ష్మయ్య గారు నర్సయ్య గారు,
కొర్ర కట్ల లక్ష్మణ్ రావు గారు , పాయం లక్ష్మీ కాంత్ గారు,
కాక భాస్కర్ గారు
నల్ల బోయిన సమ్మయ్య గారు, నల్ల బోయిన కోటయ్య గారు,
పూసం లక్ష్మీనారాయణ గారు, చింత లక్ష్మయ్య గారు అన్నవరం వెంకటేశ్వర్లు గారు పుల్లయ్య గారు తదితర పెద్దలు హాజరైనారు