గిరిజన గులాబీ నేతకు.. అధికారిక నివాళులు

పాల్గొన మంత్రులు..నాయకులు అశ్రు నయనాలతో అంతిమ సంస్కారాలుకన్నీటి పర్యంతమైన రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

గిరిజనుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేశారు… తెలంగాణ రాష్ట్ర సాధనలో కదం తొక్కారు…అనేక పదవులను అలంకరించారు…ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. నిన్న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు గిరిజన గులాబీ నాయకులు శ్రీ చందూలాల్. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు సగౌరవంగా నివాళులు అర్పించింది.
అధికారిక లాంచనాలతో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
రాష్ట్ర గిరిజన నాయకురాలు, గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ , పూర్వ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులు నేతలు అంతిమ సంస్కారాలలో పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు. మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కన్నీటి పర్యంతమయ్యారు. గిరిజన నాయకుణ్ణి కోల్పోయామని, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.