గిరిజన ముద్దుబిడ్డ, మచ్చలేని కమ్యూనిస్టు నేత, 3 సార్లు భద్రాచలం MLA గా పని చేసిన కామ్రేడ్ కుంజా బొజ్జి మరణం పార్టీకి తీరని లోటని Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.
దివి: 12-04-2021సోమవారం రోజున ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేసిన కుంజా బొజ్జి మృత్యువుతో 95 ఏళ్ల వయసులో కూడా అవిశ్రాంతంగా పోరాడి స్వర్గస్తులయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి భద్రాచలం మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ కుంజా బోజ్జి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు, జోహార్లు అర్పించారు ఈ సందర్బంగా మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కుంజా బొజ్జి మరణం కమ్యూనిస్టు విప్లవానికి తీవ్రమైన నష్టం అని, వీరి మరణం చరిత్రలో స్థిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. 3 సార్లు MLA గా గెలిచినా mla అనే గర్వం, అహంకారం, స్వార్ధం గాని లేని వ్యక్తి కుంజా బొజ్జి గారని అన్నారు. నిరంతరం కార్మిక, కర్షక, కూలీల, ప్రజల సంక్షేమం కోసం, వారి పక్షాన నిలిచిన మహోత్తమ వ్యక్తి అని తెలిపారు. వారి ఆశయసాధన కోసం, వారి అడుగు జాడలలో పార్టీ శ్రేణులు పని చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు P. ఉపేందర్, S. రమేష్, పట్టణ నాయకులు Md.దస్తగిరి, J.ప్రకాష్, B.చందు నాయక్, P.లలిత, D. సందీప్, D.నాగరాజు, M.వెంకటేష్, A.సురేష్, తదితరులు పాల్గొన్నారు