ఆలయాలు మానసిక ప్రశాంతత నిలయాలు గిరిపురం లో జరిగిన ముత్యాలమ్మ అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠాపన మహోత్సవం లో పాల్గొన్న డోర్నకల్ యువజన నాయకులు డీఎస్ రవిచంద్ర గారు.
గ్రామీణ ప్రాంతాలలో ఆలయాలు మానసిక ప్రశాంతత నిలయాలుగా వర్ధిల్లుతున్నాయని డోర్నకల్ యువనేత డిఎస్ రవిచంద్ర గారు అన్నారు.
అభయ ఆంజనేయస్వామి ముత్యాలమ్మ ప్రతిష్ఠాపన మహోత్సవంలో PVRN శాస్త్రి గారు మరియు గ్రామ ప్రజా ప్రతినిధుల ఆహ్వానం మేరకు డీఎస్ రవిచంద్ర గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తదనంతరం,ప్రతిష్ఠ మహోత్సవాలను తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్ గారి స్వతహాగా గొప్ప భక్తుడు అని ఆయన సారథ్యంలో రాష్ట్రంలోని ఆలయాలన్నీ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
