#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69న్యూస్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న కల్లుగీత కార్మీకుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీతో కలిసి చర్యలు చేపడుతున్నామని కల్లుగీత కార్మీక సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అద్యక్షుడు మారగోని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్ లో సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఐలి వెంకన్న గౌడ్ ను కలిసి చర్చలు జరిపారు. జిల్లాలో గత దశాబ్దాల కాలంగా కల్లుగీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కార్మీకులకు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తింపు కార్డులను ఇవ్వడం లేదని అన్నారు. అలాగే గుర్తింపు కార్డులు పొంది 50 సంవత్సరాలుపై బడిన కార్మీకులకు ప్రభుత్వం పెన్షన్ అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు.కల్లుగీత కార్మీకులుగా పనిచేస్తూ తాటిచెట్టుపై నుండి జారిపడి మరణించిన, వికలాంగులుగా మారిన వారికి పరిహారం నెలరోజుల లోపు అందించేలా ఎక్సైజ్ &ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలన్నారు.జిల్లాలో ఇప్పటి వరకు మరణించిన గీతకార్మీకుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందేలా చూడాలని కోరారు. ఈమేరకు రాష్ట్ర అద్యక్షుడు ఐలి వెంకన్న గౌడ్ కు శంకర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సమస్యల పరిష్కారం కోసం సమయం కోరగా శనివారం అపాయింట్ మెంట్ ఇచ్చారని వివరించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ద్వారా జిల్లా గీతకార్మీకుల సమస్యల పరిష్కారం చేయనున్నట్లు వివరించారు. ముందుగా గీతాకార్మీకుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న రాష్ట్ర అద్యక్షుడు ఐలి వెంకన్న గౌడ్ ను జిల్లా అద్యక్షుడు శంకర్ గౌడ్ కలిసిన సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.