Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|Telangana Today - Latest Telangana News

రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఆ చట్టాలు రద్దు అయ్యే వరకు ఢిల్లీ నడిబొడ్డున 365 రోజులు సమరశీల పోరాటాలు నిర్వహించిన 562 మంది రైతులు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఏ ఐ కె ఎస్ దాని అనుబంద సంఘంగా ఉన్న తెలంగాణ రైతు సంఘం లో రైతులందరూ చేరాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న రైతులకు పిలుపునిచ్చారు. మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో రైతు సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. అనంతరం రైతు అల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలం నెత్తి మీదికి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళిక వేయలేదు ఏ భూమిలో ఎలాంటి పంటలు వెయ్యాలో అస మర్ధత ప్రభుత్వంగావుంది రైతులకు ఇంకా అందుబాటులో ఉండే విధంగా ఎరువులను సిద్ధం చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి వల్ల నేటికి చాలామంది రైతులు భూ సమస్య పరిష్కారం కాకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని రైతులు పడుతున్న బాధను అర్థం చేసుకొని తక్షణమే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు ఎస్ కె మౌలానా రేఖ శ్రీనివాస్, గంధసిరి పుల్లయ్య, ఎస్ కె ఇమామ్ సబ్ యామని పుల్లయ్య, భయ్యా సురేష్, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.