గుండెపుడి గ్రామలో సీతా రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా

శ్రీరామనవమి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సం॥ర చైత్ర శుద్ధ నవమి |ది. 10-4-2022 ఆదివారం మధ్యాహ్నం గం॥ 11-55 ని॥లకు పునర్వసు నక్షత్ర సుముహూర్తమున శ్రీ అయోధ్య (గుండెపుడి) నగరాధీశులు దశరధ | మహారాజు గారి జ్యేష్ఠ కుమారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సూర్యవంశ ప్రదీపుడు శ్రీమత్ ఇక్ష్యాకు వంశోద్భివుడు సాక్షాత్ శ్రీనారాయణ “స్వరూపుడు “శ్రీరామచంద్ర స్వామి” వారికి శ్రీ మిధిలా (బురహాన్పురం) నగరాధీశులు వీరధ్వజ జనక మహారాజు గారి కుమార్తె శ్రీ చతుర్ధశ భువనాధీశ్వరి అఖిలాండకోటి బ్రహ్మాండనాయికి, తత్వస్వరూపిణి, చంద్రవంశ ప్రదీపిక, నిమవంశోద్భవి, శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి “శ్రీ సీతాదేవి” ని ఇచ్చి గుండెపుడి లోని శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపంలో | వివాహము జరిపించుటం జరిగింది
కావున యావన్మంది భగవత్-బంధువులంతా విచ్చేసి స్వామి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కల్యాణం
గ్రామ ప్రజల సహకారంతో
నూకల కిషన్ రెడ్డి (గ్రామ సర్పంచ్), అర్చకులు ఆలయ ధర్మకర్తలు నూకల సుధీర్ రెడ్డి, ఆలయ నిర్వహణ అధికారి ప్రధాన అర్చకులు సముద్రాల వెంకట లక్ష్మణ్ నరసింహాచార్యులు, సహా అర్చకులు, రాఘవాచార్యులు, రాజ వంశి , శ్రీ రామ నవమి సందర్భంగా అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు బురహాన్ పురం గ్రామానికి చెందిన నలబోలు వంశస్తులు , గుండెపుడి గ్రామం పెద్దలు బోడ పట్ల సుధాకర్, యామిని రామ్మూర్తి, పులుసు చిరంజీవి , జగదీశ్వర్ రెడ్డి, గడ్డం దామోదర్ రెడ్డి, రేఖ ఉప్పలయ్య, సూర్య బోయిన ఉప్పలయ్య, సోమ గాని శ్రీను భక్తులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.