గుండెపోటుతో ప్రైవేట్ ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు వీరా సింగ్ , వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో అప్పుల బాధ భరించలేక గుండెపోటుతో ప్రైవేట్ ఉపాధ్యాయుడు మృతి- ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సామల శశిధర్ రెడ్డి కరోన లాక్ డౌన్ కారణంగా గత మార్చి 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతబడి పది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పాఠశాలలు తెలుసుకోకపోవడం అందులో పనిచేసే ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల పైచిలుకు నిరుద్యోగంతో ఉపాధి లేక మాట్లాడుతున్నారు. అందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట లోని సెయింట్ గాబ్రియేల్ పాఠశాల నందు హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వీరా సింగ్ అప్పుల బాధ భరించలేక గుండెపోటుతో మరణించారు రాష్ట్రంలో ఇప్పటివరకూ దాదాపుగా 10 నుండి 15 మందికి పైగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది నేడు అప్పుల బాధ అ తట్టుకోలేక గుండెపోటుతో వీర సింగ్ మరణించడం కుటుంబానికి తీరనిలోటని తక్షణమే వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు కుటుంబానికి అందించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు శశిధర్ రెడ్డి ప్రకటించారు. వీరా సింగ్ కు భార్య ఒక కుమారుడు మరియు కూతురు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.