suryapeta news

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ ఎదురుగా సద్దుల చెరువు బతుకమ్మ చౌరస్తా వద్ద రోడ్డు మొత్తం వర్షానికి గుంతల మయంగా మారింది. నిత్యం ఈ రోడ్డు నుండి అనేక వాహన చోదకులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు

వర్షాలకు గుంతలమయంగా మారా యని దీనితో ఆ రహదారిలో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, ప్రయాణికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలకు ఈ గోతులు మరింత పెద్దవిగా మారుతున్నాయి. ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో జనాలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళ ప్రయాణం మరి ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. పదే పదే ఆ దారుల్లో ప్రయాణించడం వల్ల ప్రయాణికుల నడుము నొప్పి బారిన పడుతున్నామని… ప్రయాణికులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి
రోడ్ల కు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.