గుడుంబా స్థావరంలపై ఎక్సైజ్ దాడులు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రూప్సింగ్ తండా, దారవత్ తండా, చింతలగడ్డ తండా, వాంకుడోత్ తండా, గుండెపుడి గ్రామాల్లో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో వరంగల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్టీఎఫ్ హైదరాబాద్ సీఐ లతీఫ్, తొర్రుర్ సీఐ రాజిరెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐలు రజిత, శ్రీనివాసులు, మధు, హెడ్ కానిస్టేబుళ్లు రబ్బానీ, సంజీవ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.