గురుకులాల కస్తూరిబాలో ఉన్న విద్యార్థులకు హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలి

ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో గారికి వినతిపత్రం..

ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు..

ఖమ్మం :- గురుకులాల కస్తూరిబాలో ఉన్న విద్యార్థులకు హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలని ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మధు అన్నారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ :- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, కస్తూరిబాలో ఉన్న విద్యార్థులకు వాతావరణం చేంజ్ కావటంవల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా విద్యార్థులకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, మధిర మండలం కృష్ణాపురంలో ఎంతో మంది విద్యార్థులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు.. ఆ గురుకులంలో మొత్తం 500 మంది ఉన్నారు.. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన విద్యార్థులను గుర్తించి, వారి నుంచి మరొకరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ గా, ఇతర వ్యాధులు సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డీఎంహెచ్వో గారితో అన్నారు.. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యుడు సంతోష్, ఖమ్మం టౌన్ కన్వీనర్ తరుణ్, ఎస్.ఎఫ్.ఐ నాయకులు రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.