మునగాల మండల కేంద్రంలోని బరకత్ గూడెం గ్రామ శివారులో వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. విజయ రాఘవపురం గ్రామానికి చెందిన కత్తి మధు అనే వ్యక్తి గత తొమ్మిది నెలల నుండి తన మామ గారైన సురేపల్లి వీర బాబు పాత కొండాపురం గ్రామం చిలుకూరు మండలం వద్ద నివాసం ఉంటూ నిన్న రాత్రి సమయంలో విజయపురం వచ్చుటకు కాలినడకన వస్తుండగా మార్గమధ్యంలో బరాఖత్ గూడెం గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్ళు గుర్తుతెలియని వాహనంఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై బాలు నాయక్ తెలిపినారు.
