గొడ్డలితో దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించిన

గొడ్డలితో దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..పాలడుగు నాగార్జున
జిల్లా ప్రధాన కార్యదర్శి కులవివక్ష వ్యతిరేక పోరాటసంఘం నల్గొండ

గత యాభై ఏళ్లుగా భూమి దున్నుకొని జీవిస్తున్న దళిత కుటుంబాలపై నా మాదగోని రామకృష్ణ మరికొందరు గొడ్డలితో నరికి దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు ఈరోజు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న నల్లగొండ జిల్లా చిట్యాల మండలం బోయ గుబ్బా గ్రామానికి చెందిన దళితుడు రెడ్డిమల్ల నర్సింహా ముత్తమ్మ లను పరామర్శించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇరవై అయిదు ధళిత కుటుంబాలు గత యాభై ఏండ్లుగా కాస్తు చేసుకుంటున్న భూమిపైన దౌర్జన్యంగా అక్రమంగా చొరబడి మాల కులం పేరుతో దూషించి నర్సింహా మరియు భార్య ముత్తమ్మ లను విపరీతంగా కొట్టి మిమ్మల్ని చంపినా ఎవ్వరూ ఏమీ చేయలేరని అంటున్నారంటే ఎంతటి దౌర్జన్యమొా అర్థమౌతుందని అన్నారు.పోలీస్ స్టేషన్కు వెళ్లినదళితులను చిట్యాల సీఐ బెదిరించాడని అట్లనే కొడతారు ఏం చేస్తారో చేయండి అని చెప్పి తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరైనది కాదని అన్నారు.వెంటనే రెవెన్యూ అధికారులు అట్టి భూమిని సర్వే నిర్వహించాలని కోరారు.చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యం కు పాల్పడి వారికి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. గౌరవ జిల్లా ఎస్పీగారు జోక్యం చేసుకొని ఎస్సీ ఎస్టీ కేసులు మరియు అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదు చేయాలని కోరారు* .
బాధితులకు గాయాలైనందున ప్రభుత్వం సరియైన వైద్య సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.
పరామర్శించిన వారిలో నాయకులు గంజి లెనిన్ ఆవుల సుధాకర్ గంజి లింగస్వామి బొల్లం భీమయ్య బీరం రత్నారెడ్డి తదితరులు ఉన్నారు చిట్యాల నల్లగొండ జిల్లా

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.