రెండో విడుత గొర్రెలను గొర్రెల మేకల పెంపకందారుల సంఘo జిల్లా కార్యదర్శి


నగదు బదిలీ చేయాలని GMPS జనగాం జిల్లా కమిటీ డిమాండ్
ఈరోజున నమీలిగొండకు రెండో విడుత గొర్రెలను గొర్రెల మేకల పెంపకందారుల సంఘo జిల్లా కార్యదర్శి సాదం రమేష్ గొర్రెలకాపరులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గొల్లకురుమలకు గొర్రెలపంపిణీ కార్యాక్రమం చేపట్టి కోట్లాదిపతులను చేస్తానని చెప్పిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే. కాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 125000/రూపాయలు స్కీమ్ 20 అడగొర్రెలు ఒక్క మగ పోతు. దాణా, మందుల కిట్టు, గొర్రెలకు ఇన్సూరెన్స్ డీసీఎం కిరాయి పోను,111000/రూపాయల తో 21 గొర్రెలను గోనుగోలు చెయ్యాలి.కాని మొదటి విడుతలో 15 రోజుల పిల్లలు మొదలుకొని భూమి పైన నిలబడలేని గొర్రెలు పంపిణీ చేసారు. రెండో విడుత కోసం గత మూడు సంవత్సరం ల క్రింద 31250/డిడిలు తీస్తే వాటికీ మిత్తి ఇప్పటికి ఒకొక్కరు 24000/వివిధ ప్రైవేటు పైనానస్ లో డబ్బులు చెల్లించి ఉన్నారు. ఈనెల 1 వ తేది నుండి రెండో విడుత గొర్రెలపంపిణీ ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని నమీలిగొండ గ్రామానికి చెందిన 21 మంది గత మూడు రోజులక్రింద గుంటూరు జిల్లాకు పోవడం జరిగింది. అక్కడ ముగ్గురు పశుసంవర్తక శాఖ అధికాలను పర్యవేక్షణ అధికారులుగా నియమీంచారు. ఇక్కడి నుండి వెళ్లిన గొర్రెలకాపరులను గొర్రెలు ఉన్న చోటుకు తీసుకవెల్లాలి కాని అట్టి టీమ్ వారు ఆంధ్రప్రదేశ్ సంబందించిన దళరులకు అప్పచెప్పుతున్నారు వారు గొల్లకురుమలను ఎక్కడెకడానో తిప్పుకుంటూ ముప్పుతిప్పాలా పెడుతూ ఎక్కడ తిరిగిన ఇవ్వే గొర్రెలు ఇవ్వే పిల్లలు 7,8 గొర్రెలు 3,4 పిల్లలు ఇస్తామని మొత్తం 11గొర్రెలు మాత్రమే లేకుంటే 50.60వేలు ఇస్తాo తీసుకోని పోండి. లేకుంటే 21 గొర్రెలకు ఇన్సూరెన్స్ బిళ్ళలు డాక్టర్ లతో వేయిoచండి. మీరికి పోగానే 11గొర్రెలు అక్కడ దించుకొని మీ డాక్టర్ తో ఫొటోలు దిగి సంతకం చేపించి మిగతా 10 గొర్రెలు రిటన్ వచ్చే DCM లో పంపండి అని లేదంటే మీఇష్టం ఎవరికైయిన చెప్పండి అని అంటే అక్కడున్న సెంట్రల్ టీమ్ వద్దకు వెళ్లి అడిగితే వాళ్లు మీరు ఏమైనా మాట్లాడుకొండ్రి నాకు తెలియదు మీకు నచ్చకుంటే వెళ్లిపోండి అని అంటున్నా పరిస్థితి ఉన్నది.
కావున గొర్రెల్లో గోల్ మాల్ జరుగకుండా ఉండాలంటే గొల్లకురుమలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కనుక ప్రభుత్వానికి ఉంటే డిడిలు తీసిన గొల్లకురుమలకు 111000/రూపాయలు వారి అకౌంట్ లోకి నగదు బదిలీ చేయాలని GMPS జిల్లా కమిటీ నుండి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
గొల్లకురుమలకు ఆలేరు MLA గొంగడి సునీత క్షేమపణ చెప్పాలి
నిన్న ఆలేరు నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో మీటింగ్ పెట్టితే అట్టి మీటింగ్ కు ఒక్కయన లేచి మేడం మా గొల్లకురుమలు గొర్రెలకోసం డిడిలు తీసీ మూడు సంవత్సరాలు అవుతుంది. గొర్రెలు ఇంకెప్పుడు ఇస్తారు అని లేచి అడగగానే MLA గారు కోపంతో లేచి ఆయనేవ్వరు గొర్రెలు అడుగుతున్నారు బయటికి నెట్టేయండి అని కోపంతో ఉగిపోయారు ఆయనకు గొర్రెలు ఇవ్వకండి అని పశుసంవర్థక శాఖ అధికారులను పిలిచి చెప్పి అవమాన పార్చిన MLA గొంగడి సునీత క్షేమపణ చెప్పకుంటే సంఘo ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సంఘo మండల అధ్యక్షులు మేకల మల్లేష్, కార్యదర్శి మాదరబోయన కరుణాకర్. నమీలిగొండ MPTC పురామని రాజాకు యాదవ్ సంఘo మండల గౌరవ అధ్యక్షులు గారు సోసైటీ అధ్యక్షులు కోటే రాజయ్య తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.