గొర్ల మేకల పెంపకం దారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటాలు నిర్వహించాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. జూలై
28 30 నుండి జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాలకు. రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్ అధ్యక్షతన. హనుమకొండలో జరుగుతున్నాయి ఈరోజు ముగింపు సందర్భంగా. రాష్ట్ర అధ్యక్షులు కిల్లే గోపాల్ మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకం దారులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం దశలవారిగా. ఆందోళన. పోరాటాలు నిర్వహించాలని గోపాల్ పిలుపునిచ్చారు. రెండో విడత గొర్ల పంపిణీ లో నగదు బదిలీ చేయకుంటే మధ్య దళారులు అధికారులు లాభపడతారు. తప్ప గొర్ల కాపరులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వం నగదు బదిలీ చేసి గొర్ల కాపరులకు న్యాయం చేయాలని గోపాల్ డిమాండ్ చేశారు. నిన్న రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రవేశపెట్టిన.,10 తీర్మానాలను చర్చించి. రాష్ట్ర కమిటీ. ఏకగ్రీవంగా ఆమోదించింది. భవిష్యత్తులో ఈ తీర్మానాలపై ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చింది ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ ఆమోదించడం జరిగింది.
GMPS రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానాలు
1) నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ చేయాలి.
2) NLM లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటనే ఋణాలు ఇవ్వాలి.
3) గతంలో తీసుకున్న NCDC ఋణాలను మాఫీ చేయాలి.
4) ఆగస్టు 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతులిస్తూ ఆందోళనలకు పిలుపు.
5) ఆగస్టు రెండో వారంలో రౌండ్ సమావేశాలకు పిలుపు.
6) గొల్ల కురుమ యువతకు 50 లక్షల సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి
7) అన్ని గొర్రెలకు ఇన్సూరెన్స్ ప్రవేశ పెట్టాలి.
8) 18 సంవత్సరాలు నిండిన వారందరికీ సొసైటీలలో సభ్యత్వం ఇవ్వాలి.
9) అన్ని గొర్రెలకు నీలి నాలుక వ్యాధి టీకాలు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలి.
10) ఖాళీగా ఉన్న పశువైద్య పోస్టులన్నీ భర్తీ చేయాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాసాని ఐలయ్య రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అవిశెట్టి శంకరయ్య కాడబోయిన లింగయ్య సాదం రమేష్ తూషాకుల లింగయ్య. ఆలేటి యాదగిరి. రాష్ట్ర సహాయ కార్యదర్శులు అమీర్పేట్ మల్లేశం. బొల్లం అశోక్. కాల్వ సురేష్ .పరికి మధుకర్ జిల్లా అధ్యక్షులు శాతబోయిన రమేష్ గంటి సమ్మయ్య వేల్పుల రమేష్ బండి పర్వతాలు రాజు జంపాల రమేష్.కే రాజేష్. తదితరులు పాల్గొన్నారు అభినందనలతో
కే లింగయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమకొండ జిల్లా కార్యదర్శి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.