గోళ్ళమూడి గ్రామంలో పోలీస్ సిబ్బంది కవాతు

కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలనుసారం నందిగామ డిఎస్పి జి నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో బుధవారం పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు

ఈ సందర్భంగా సి ఐ కనక రావు మాట్లాడుతూ గ్రామంలోగ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని నందిగామ సీఐ పి కనకారావు పేర్కొన్నారు. ఎటువంటి ఘర్షణలు , అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం , డబ్బు పంపిణీ జరుగుతున్నట్లు గ్రామస్తుల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.. నందిగామ ఎస్ ఐ తాతాచార్యులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గ్రామంలో ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.