గౌడ గీత కార్మికులకు న్యాయం జరగాలని నిరసన

ఉప్పుగల్లు రిజర్వాయర్ లో తాటిచెట్లు కోల్పోయిన గౌడ గీత కార్మికులకు న్యాయం జరగాలని నిరసన కార్యక్రమం

2013వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు లభించినవిలభించినవి
ఇందులో రిజర్వాయర్ భూసేకరణ లో భాగంగా గౌడ కులస్తుల భూములు 90% కోల్పోయారు, అంతేకాకుండా గౌడ గీత కార్మికుల జీవనోపాధి అయిన తాటిచెట్లు సుమారు 1250 చెట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది
దీనితో 2016న రిజర్వాయర్ శంకుస్థాపన రోజున మన గౌడ కులస్తులు అందరూ ప్రతిఘటించి అడ్డుకున్నారు
అప్పుడు పోలీసులు మన గీత కార్మికుల పై లాఠీ ఛార్జ్ చేయడం కూడా జరిగింది
ఆ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆనాటి మంత్రివర్యులు చందూలాల్ ,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఉప్పుగల్లు గ్రామ వాస్తవ్యుడు వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ కల్పించుకొని గౌడ గీత కార్మికులకు ధైర్యం చెబుతూ గ్రామంలో ఉన్న 300 కుటుంబాలు రోడ్డున పడకుండా నష్టపరిహారంగా కోల్పోయిన తాటి చెట్లకు ఒక్కోదానికి 25000 వేల రూపాయలు నష్టపరిహారం మరియు కోల్పోయిన తాటి ఈత వనం మళ్లీ పెంచుకోవడానికి 10 ఎకరాల భూమి కేటాయిస్తామని నిండు సభలో ప్రజల అందరి ముందు గీత కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది
అట్టి విషయం నాటి రోజు అన్ని దిన పత్రికలలో ప్రచురితమైనది ఆ హామీ కేవలము దినపత్రిక ప్రచురణ వరకే మిగిలిపోయింది
అనంతరం గౌడ సంఘం గీత కార్మికులంతా మంత్రులకు, ఎమ్మెల్యేలకు,కలెక్టర్లకు,గ్రీవెన్స్ సెల్ మరియు ఇతర అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసి పోయినాము
నాటి నుండి నేటి వరకు రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తిగా వచ్చినవి
మాకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగనందున నిరసనగా ఎక్కడైతే మా జీవనోపాధి కోల్పోతున్నామో అక్కడే టెంట్లు వేసుకుని 1-3-2021 నాటి నుండి రిజర్వాయర్ పనులు అడ్డుకుని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది

ఉప్పుగల్లు గౌడ గీత కార్మిక సంఘం న్యాయమైన డిమాండ్లు

1) కోల్పోతున్న తాటిచెట్టు ఒక్కోదానికి 25 వేల రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

2) తాటి ఈత ఖర్జూర చెట్లు పెంచుకోడానికి గ్రామంలో ఇరవై ఎకరాల భూమి గీత కార్మికుల సంఘానికి వెంటనే కేటాయించాలి

3) తాటి చెట్టు పెరగడానికి కనీసం 20 సంవత్సరాల సమయం పడుతుంది, కావున గౌడ సంఘం ప్రతి కుటుంబానికి పదిలక్షల సబ్సిడీ రుణాలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి

4) నీరా తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసి గీత కార్మికులకు,మహిళలకు మరియు యువకులకు ఉపాధి కల్పించాలి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.