గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి ప్రజలపై దండయాత్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

మరిపెడ బంగ్లాలో భారీ వర్షంలో వంటావార్పు నిరసన వ్యక్తం చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రపంచంలోనే అత్యధిక ధరకు వంట గ్యాస్ అమ్ము తున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. తాజాగా సబ్సిడీ సిలిండర్పై మరో రూ.50 పెంచి.. ఏడాదిలోనే రూ.244. మేర పెంచారని ఆరోపించారు. మోడీ పాలనను చూస్తుంటే అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించు కుంటుందన్నారు. “2014లో మోడీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.410 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,100 దాటడం దురదృష్టకరం. నరేంద్ర మోడీ’ హయాంలో గ్యాస్ బండ ధరలతో పేదల్ని బా దేస్తున్నారు. సబ్సిడీ ఎత్తేసి దేశ ప్రజలపై మోడీ దొంగ దాడి చేస్తున్నారు” అని ఆరోపించారు. డాలర్తో పోల్చితే రూపాయి విలువ రోజురోజుకు తగ్గిపోతున్నదని, పెట్రో ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయని అన్నారు. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయని, ప్రతి కుటుంబం ఇబ్బందులు పడుతున్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం ధరల పెంపుతో ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నదన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయలేని దౌర్భాగ్యపు పాలనకు నాయకత్వం వహిస్తున్న మోడీ పన్నులు పెంచి దేశ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఉజ్వల పథకం కింద అంటగట్టిన సిలిండర్లను పక్కన పెట్టి మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మహిళలు చూస్తున్నారని అన్నారు. కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలు, ధరల పెంపుపై టీ ఆర్ఎస్ నిరంతరం వివిధ రూపాల్లో ఉద్యమిస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఎంపీపీ అరుణ రాంబాబు జడ్పిటిసి శారద రవీందర్ నాయక్, ఎల్లంపేట సర్పంచ్ తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మహిళా మండలి అధ్యక్షులు రాంపల్లి అశ్విని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.