#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా నిధులు

  • ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో రూ.20లక్షలతో వ్యయంతో సీసీ రోడ్డు ను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు .గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు డంపింగ్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్నదన్నారు అని తెలిపారు. ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యకలాపాల పనితీరు మెరుగు, పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ శాఖ రెండు యాప్ లను అమల్లోకి తెచ్చిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం 70ఏండ్లలో సాధించాల్సిన అభివృద్ధిని కేవలం ఏడేండ్లలో సాధించిందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక మార్పుల కారణంగా రైతులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండ సైదయ్య, జడ్పి కోఆప్షన్ సభ్యులు జానీమియా, సర్పంచ్ తమ్మనబోయిన శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాదగిరి, పల్ల రామిరెడ్డి, దేశ బోయిన నాగరాజు, కొండ లచ్చయ్య, వెంకటేశ్వర్లు, వెంకన్న, రంగయ్య, లక్ష్మయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.