గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి

ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు

ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు

అంతిమ సంస్కారాల కోసం ప్రభుత్వం ప్రతి గ్రామంలోవైకుంఠ ధామాలను నిర్మాణం

ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

18 లక్షల వ్యయంతో నూతన పశు వైద్యశాలకు ప్రారంభోత్సవం

భారీ గజమాలతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికిన గులాబీ దళం

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం ” ప్రజల కోసం- ప్రగతి కోసం ” కార్యక్రమాన్ని కోదాడ మండలంలో దొరకుంట, నల్లబండగూడెం, మంగలితండా గ్రామాలలో నిర్మించిన వైకుంఠ దామలను, పల్లె ప్రకృతి వనాలను, డంపింగ్ యార్డులను, సిసి రోడ్లు ను,పాఠశాల ప్రహరీ గోడను కోదాడ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రాంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన అన్నారు.గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు డంపింగ్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్నదన్నారు అని ఆయన తెలిపారు. ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు, అంతిమ సంస్కారాల కోసం వైకుంఠ ధామాలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యకలాపాల పనితీరు మెరుగు, పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ శాఖ రెండు యాప్ లను అమల్లోకి తెచ్చిందని అన్నారు. పంచాయతీ సెక్రటరీ యాప్, ఇన్స్ పెక్షన్ అధికారి యాప్ లకు అనూహ్య ప్రజాదరణ లభిస్తున్నదని చెప్పారు. గ్రామాలవారీగా నాలుగేండ్ల అభివృద్ధి ప్రణాళిక ను ప్రభుత్వం సిద్ధం చేసిందని అన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ప్రతీ ఏటా ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.3,694 కోట్లు, నరేన నిధుల నుంచి రూ.5,885 కోట్లు, గ్రామపంచాయతీల ద్వారా సొంతంగా రూ.337 కోట్లు సమకూరుతున్నాయని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ప్రతీ ఏటా రూ.9,916 కోట్ల నిధులు సమకూరుతున్నాయని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం 70ఏండ్లలో సాధించాల్సిన అభివృద్ధిని కేవలం ఏడేండ్లలో సాధించిందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు. ప్రపంచ దేశాలను కరోనా కబళించినప్పటికీ స్వరాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల కొరతతో నిలిచిపోలేదని అన్నారు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ సర్కార్ సాకారం చేస్తున్నదని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ విడుదల చేస్తున్నదని అన్నారు. రైతు మృతిచెందితే అతడి కుటుంబం రోడ్డునపడే దుస్థితి నెలకొనవద్దనే ఉద్దేశంతో రైతు బీమా పథకం ద్వారా నామినీకి రూ.5లక్షల చెక్కును ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక మార్పుల కారణంగా రైతులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. అనంతరం నల్లబండగూడెం గ్రామంలో 18 లక్షల రూపాయల వ్యయ్యంతో నిర్మిస్తున్న పశు వైద్యశాలను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. చేశారు. భారీ గజమాలతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ చింత కవితా రాధా రెడ్డి, జెడ్పిటిసి కృష్ణకుమారి శేషు,వైస్ ఎంపీపీ రాణి బ్రహ్మయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అనంత సైదయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సురేష్ ,సమన్వయ కమిటీ సభ్యులు గంటా శ్రీనివాసరావు ,ొసైటీ చైర్మన్ రమేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు సుశీల బెంజమిన్, ఆంధ్రజ్యోతి ,పద్మ జబ్బార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్ ,ఎంపిటిసిలు క్రాంతికుమార్, కోటేశ్వరరావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు వెంకట్ రెడ్డి బాలకృష్ణ, వెంకటేష్ , పత్తిపాక శ్రీనివాస్, నాయకులు గద్దె నరేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి వీరబాబు, ధరావత్ బాబ్జి, బట్టు కోటేశ్వరరావు,నాయకులు రామారావు, సాంబశివరావు, నెల్లూరు అప్పారావు, శ్రీనివాసరావు, యూత్ ప్రధాన కార్యదర్శి కంచుకంటి గోపి జిల్లా బోసు బాబు ,ంపీడీఓ , తాసిల్దార్, మండల అధికారులు, పంచాయితీ కార్యదర్శిలు ,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.