గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి

ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

అంతిమ సంస్కారాల కోసం ప్రభుత్వం ప్రతి గ్రామంలోవైకుంఠ ధామాలను నిర్మాణం

ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది కాలేశ్వరం ద్వారా మోతే మండలానికి సాగునీరు

తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం ప్రజలకోసం ప్రగతికోసం కార్యక్రమాన్ని మోతే మండలంలోని భీక్య తండా, బల్లు తండా, లాల్ తండా, సిరికొండ, అప్పన్న గూడెం గ్రామాలలో శ్మశాన వాటికలను,పల్లె ప్రకృతి వనలను, డంపింగ్ యార్డ్, నర్సరీలు, సిసి రోడ్లు డ్రైనేజీలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన అన్నారు.గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు డంపింగ్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్నదన్నారు అని ఆయన తెలిపారు. ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు, అంతిమ సంస్కారాల కోసం వైకుంఠ ధామాలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ప్రతీ ఏటా రూ.9,916 కోట్ల నిధులు సమకూరుతున్నాయని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం 70ఏండ్లలో సాధించాల్సిన అభివృద్ధిని కేవలం ఏడేండ్లలో సాధించిందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు. ప్రపంచ దేశాలను కరోనా కబళించినప్పటికీ స్వరాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల కొరతతో నిలిచిపోలేదని అన్నారు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ సర్కార్ సాకారం చేస్తున్నదని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ విడుదల చేస్తున్నదని అన్నారు. రైతు మృతిచెందితే అతడి కుటుంబం రోడ్డునపడే దుస్థితి నెలకొనవద్దనే ఉద్దేశంతో రైతు బీమా పథకం ద్వారా నామినీకి రూ.5లక్షల చెక్కును ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక మార్పుల కారణంగా రైతులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అని ఆయన తెలిపారు. నాలుగు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుండి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మోతే మండలానికి సాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన తెలిపారు .గిరిజన సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు వేలూరి వెంకటేశ్వర రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు భీక్య తండా ఝాన్సీ బాబు, బల్లు తండా గాంధీ, లాల్ తండా ఉమా వెంకన్న, సిరికొండ సావిత్రమ్మ, అప్పన్న గూడెం పద్మా కృష్ణ, రాయపాడు ఎంపీటీసీ సండ్ర పద్మ మధుసూదన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి ,సమన్వయ కమిటీ సభ్యులు , పలసు మన్సూర్ ,ొసైటీ చైర్మన్ కొండపల్లి వెంకట్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నరసింహారావు, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు కంపాటి వెంకన్న,ఆయా గ్రామాల సర్పంచులు గుండాల గంగులు, కొటేష్, మిక్కిలినేని పురుషోత్తం రావు ,ఎంపిటిసిలు సంజీవరెడ్డి, మేకల శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు, కారంగుల శ్రీనివాస్ గౌడ్, దేవుల నాయక్, , సోమగాని సోమేష్ గౌడ్, నూకల శ్రీనివాస్ రెడ్డి, శివరంజని రెడ్డి, సంజీవరెడ్డి, కండక్టర్ వెంకన్న, జిల్లపెళ్లి ముత్తయ్య, ఎలమంచి, మధు నాయక్, తాసిల్దార్, ఎంపీడీవో,మండల అధికారులు, పంచాయితీ కార్యదర్శిలు ,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.