హైద్రాబాద్ లోని VermcLabs కంపని లో నిర్వహిస్తున్న యువత కు ఉపాధి అవకాశాలు మీద జలగం సుధీర్ ప్రసంగిస్తు ప్రపంచ దేశాల్లో పనిచెస్తున్న సాఫ్ట్ వేర్ నిపుణుల్లో భారతీయులే అధికం అందులో కూడ గ్రామీణ భారతీయం ముందంజ లో ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకెతిక అవసరాలను అందిపుచ్చుకుంటు తమ ప్రత్యేకత నిరుపించుకుంటున్న యువత గత కొంత కాలంగా చెడు అలవాట్లకు బానిసలు కావటం బాధకరం అని వాటి నుండి దూరంగా ఉంటు చేతిలో ఉన్న Google, Youtube లాంటి టెక్నాలజిలు వాడుకొని తమ లో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టాలని సుధీర్ కోరారు. సుర్యాపేట జిల్లా నుండి అనేక మంది పాల్గొన్న ఈ సమావేశం లో ముఖ్య అథిదిగా పాల్గొన్న జలగం సుధీర్ వెంకట్రామపురం అనే గ్రామం నుండి వెల్లిన తాను అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ దేశాలలో అనుభవాలను పంచుకుని యువతను ఉత్తేజపరిచారు.