గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతి-ఎమ్మెల్యే బొల్లం

ఆధాత్మిక తో గ్రామాల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం చిలుకూరు మండలంలోని జెర్రిపోతుల గూడెం గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవం గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… ఆలయాల నిర్మాణాలతో గ్రామాల్లో ధర్మ రక్షణ జరుగుతుందన్నారు. ఆధ్యాత్మిక భావాలతో ప్రజల్లో శాంతి భావాలు నైతిక విలువలు పెంపొందుతాయి అన్నారు. శ్రీ గంగమ్మ తల్లి అనుగ్రహంతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు. గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండా సైదయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ సైదులు, వైస్ చైర్మన్ జానకి రామాచారి, టిఆర్ఎస్ నాయకులు శేషు, తాళ్లూరి శ్రీనివాస్, ,సర్పంచ్ సుజాత శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు అనంత వెంకటయ్య, యాదవులు,నాయకులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.