గ్రామ సేవకులకు పే స్కేల్ అమలు చేయాలి చంద్రశేఖర్ డిమాండ్

ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ ముందు సమ్మె చేస్తున్న వీఆర్ఏ గ్రామ సేవకులు చేస్తున్న సమ్మెకు చంద్రశేఖర్ సిఐటియు జిల్లా కన్వీనర్ మద్దతు తెలిపారు వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు పే స్కేల్ ఇస్తామని ప్రకటించారు నేటికీ 22 నెలలవుతున్న పే స్కేల్ ప్రకటించకపోవడంతో విఆర్ఏలు మనోవేదనతో అనేకమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి వెంటనే సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం పే స్కేల్ అమలు చేయాలి 55 స..నిండిన వారికి వారి కుటుంబంలో ఒక్కరి కి ఉద్యోగం ఇవ్వాలి అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సిఐటియుగా అన్ని సంఘాలను ఐక్యం చేసి సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు
ఈ సమ్మెకు కె. రాజనర్సు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ సంతోష్ జిల్లా అధ్యక్షులు సత్యం బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు తదితరులు సమ్మెకు మద్దతు తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.